Breaking News

ఏమిటీ భాష? వైసీపీ నేత సజ్జలపై నారా లోకేష్ ఆగ్రహం


Published on: 09 Jun 2025 18:55  IST

తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలియజేస్తే, వైసిపి నాయకులకు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా? అంటూ నిలదీశారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఏమిటీ ఈ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. తల పండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేశ్యలు అంటూ అవమానించారు.. ఇప్పుడు వైసిపి నేతలు మహిళల్ని కించపరుస్తూ సంకరజాతి అంటూ దిగజారి మాట్లాడుతున్నారు అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి