Breaking News

తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పేట భాస్కర్ డిమాండ్‌

భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని జగిత్యాల జిల్లా కేంద్రంలో వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పేట భాస్కర్ డిమాండ్‌ చేశారు.


Published on: 01 Apr 2025 23:50  IST

జగిత్యాల:  జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్ లో మంగళవారం జరిగిన మాదిగ సంఘాల సమావేశం లో పేట భాస్కర్ మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని నెలకొల్పేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. విగ్రహాన్ని తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ అది మూలన పడివుందని, కనీసం ఈనెల 5న జరగబోయే జయంతోత్సవాలకు ముందు విగ్రహాన్ని ప్రతిష్టించాలని జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు వెంటనే చొరవ తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో ధర్మపురి ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదినాన్ని ఘనంగా జరిపారు.

కార్యక్రమంలో జిల్లా నాయకులు, జయంతోత్సవాల కమిటీ ప్రతినిధులు నక్క విజయ్, బొల్లి శేఖర్, బెజ్జెంకి సతీస్, బంగారు దీపక్, దుమాల రాజ్ కుమార్, బొనగిరి దేవయ్య, బొల్లే గంగారాం, బొల్లంపల్లి సంపత్ కుమార్, కొంగర పవన్, గజ్జెల రాజు, నక్క రమేష్, ముదిగం రాజేందర్, దాసరి సతీష్, బొనగిరి నారాయణ, పూడురి శోభన్ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎంపీపీలు దర రమేష్ బాబు, మకిల్ ఇజ్రాయిల్ సహా మాదిగ సంఘం నాయకులు ఎస్. రాజయ్య, బి. రాజ్ కుమార్, నక్క గంగాధర్, దుమాల గంగారాం, బడుగు రాజేందర్, సంగెపు ముత్తు తదితరులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి