Breaking News

ఆస్ట్రియా స్కూల్లో కాల్పులు.. 8 మంది దుర్మరణం


Published on: 10 Jun 2025 16:56  IST

ఆస్ట్రియాలోని గ్రాజ్ నగరంలో ఓ స్కూల్లో మంగళవారం కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో సుమారు 8 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. కాల్పుల సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని అక్కడి అధికారులు తెలిపారు. ఘటనపై ఆస్ట్రియా అంతర్గత వ్యవహారాల శాఖ కూడా స్పందించింది. ఈ కాల్పుల్లో పలువురు మరణించినట్టు తెలిపింది. మృతుల్లో విద్యార్థులు, అధ్యాపకులు ఉన్నారా లేదా అనే అంశాలను మాత్రం వెల్లడించలేదు.

Follow us on , &

ఇవీ చదవండి