Breaking News

ఓయూ ప‌రిధిలో బీఈ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు


Published on: 10 Jun 2025 18:37  IST

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని విభాగాల బీఈ సీబీసీఎస్, బీఈ నాన్ సీబీసీఎస్, బీఈ ఏఐసీటీఈ కోర్సుల చివరి సెమిస్టర్ మెయిన్, బ్యాక్ లాగ్, వన్ టైం ఛాన్స్ పరీక్షలను ఈనెల 25వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి