Breaking News

ట్రంప్‌ హతమారుస్తాం: అల్‌ఖైదా


Published on: 11 Jun 2025 17:43  IST

ఉగ్ర సంస్థ అల్‌ఖైదా అరేబియన్‌ పెనున్సులా విభాగం సంచలన ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సహా ఆయన కార్యవర్గంలోని కీలక మంత్రులను, శ్వేతసౌధం సిబ్బందిని హతమారుస్తామంటూ వెల్లడించింది. ఇటీవల ఈమేరకు ఆ సంస్థ నాయకుడు సాద్‌బిన్‌ అతేఫ్‌ అల్‌-అవ్లాకీ దాదాపు 30 నిమిషాల నిడివితో ఓ వీడియో విడుదల చేశాడు. అతడి తలపై అమెరికా 6 మిలియన్‌ డాలర్ల రివార్డును ఇప్పటికే ప్రకటించింది. 2024 మార్చిలో అల్‌-అవ్లాకీ ఈ సంస్థకు అధిపతిగా బాధ్యతలు చేపట్టాడు.

Follow us on , &

ఇవీ చదవండి