Breaking News

ఫార్ములా ఈ రేస్ కేసు.. ఏసీబీ ఎదుటకు కేటీఆర్


Published on: 16 Jun 2025 12:30  IST

ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ (ACB) విచారణకు హాజరయ్యారు. ఈరోజు ఉదయం (సోమవారం) బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి కేటీఆర్‌ చేరుకోగా.. అధికారులు విచారణను ప్రారంభించారు. ఫార్ములా- ఈ రేస్‌ కేసులో కేటీఆర్‌ ఏ1గా ఉన్నారు. నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీకి నగదు బదిలీకి సంబంధించి ఆయనపై ఏసీబీ అధికారులు ప్రశ్నలు సంధించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి