Breaking News

దేశవ్యాప్తంగా జియో నెట్‌వర్క్‌ డౌన్‌..


Published on: 16 Jun 2025 16:39  IST

దేశవ్యాప్తంగా జియో నెట్‌వర్క్‌ డౌన్‌ అయ్యింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా మొబైల్‌ ఇంటర్నెట్‌, ఫోన్‌ కాల్, జియోఫైబర్‌ సర్వీసులలో సమస్యలు తలెత్తాయి. సోమవారం మధ్యాహ్నం 1.45 గంటలకు కేవలం 400 ఫిర్యాదులు అందగా.. ఆ తర్వాత గంటసేపట్లో అంటే 2.45 కల్లా ఫిర్యాదుల సంఖ్య 12 వేలు దాటింది. ఈ సమస్యలపై ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్‌ల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. ఈ ఔటేజ్‌కు కారణం ఏందనే దానిపై జియో అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి