Breaking News

25న జరిగే బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్ష వాయిదా


Published on: 16 Jun 2025 16:58  IST

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈనెల 25న నిర్వహించనున్న బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షను యూజీసీ నెట్ పరీక్ష నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను తిరిగి ఈనెల 30వ తేదీన నిర్వహించనున్నామని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రం, సమయాల్లో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఇతల వివరాలకు ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి