Breaking News

ఐఏఈఏ అణుశక్తి సంస్థ నుంచి ఇరాన్ వైదొలగే ఆలోచన!


Published on: 16 Jun 2025 18:04  IST

ఇజ్రాయెల్‌తో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ) నుంచి వైదొలగడానికి సిద్ధమవుతున్నట్లు టెహ్రాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగశాఖ ప్రతినిధి ఇస్మాయిలీ బాఘై సోమవారం వెల్లడించారు. దీనికి సంబంధించి తమ దేశ పార్లమెంట్ ఒక బిల్లును సిద్ధం చేస్తోందని ఆయన తెలిపారు.ఎన్‌పీటీ మాత్రమే కాకుండా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) సభ్యత్వం నుంచి కూడా వైదొలగే అంశాన్ని ఇరాన్ పరిశీలిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి