Breaking News

నిలకడగానే సోనియా గాంధీ ఆరోగ్యం


Published on: 16 Jun 2025 18:29  IST

కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఉదర సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని సర్‌ గంగారం దవాఖానలో చేరారు. ప్రస్తుతం సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే (health remains stable) ఉన్నట్లు ఆసుపత్రి చైర్మన్‌ అజయ్‌ స్వరూప్‌ తెలిపారు. గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యులు సోనియాని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఉద‌ర సంబంధిత స‌మ‌స్యల‌తో సోనియా గాంధీ ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరారు.

Follow us on , &

ఇవీ చదవండి