Breaking News

ఇరాన్‌లో ఏదో జరగబోతోంది సిట్యుయేషన్‌ రూమ్‌కు ట్రంప్‌..!


Published on: 17 Jun 2025 13:38  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హడావుడిగా జీ7 వేదికను వీడి అమెరికాకు తిరుగు ప్రయాణం కావడంతో.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టెహ్రాన్‌ గగనతలాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకొన్నామని ఇజ్రాయెల్‌ ప్రకటించిన వేళ.. ఈ పరిణామాలు చోటుచేసుకొన్నాయి. ఆ నగరాన్ని ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ట్రంప్‌ స్వయంగా హెచ్చరికలు జారీ చేయడం దీనికి ఆజ్యం పోసినట్లైంది. కాల్పుల విరమణ ఒప్పందం గురించి వాషింగ్టన్‌ వెళ్లలేదు అంతకంటే పెద్దదే జరగబోతోంది అని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్‌ పెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి