Breaking News

వాట్సాప్‌ వాడొద్దు.. మీ డేటా ఇజ్రాయెల్‌కు:ఇరాన్‌


Published on: 18 Jun 2025 16:36  IST

తమ దేశ ప్రజలు తక్షణమే స్మార్ట్‌ఫోన్ల నుంచి మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ను తొలగించాలని ఇరాన్‌ సూచించింది. ఈమేరకు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థలో ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజల సమాచారాన్ని వాట్సాప్‌ సేకరించి ఇజ్రాయెల్‌కు పంపిస్తోందని పేర్కొంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలను మాత్రం వెల్లడించలేదు. తమ దేశానికి చెందిన కీలక సైనిక జనరల్స్‌, అణు శాస్త్రవేత్తలను మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్‌ వారి సెల్‌ఫోన్లను ట్రాక్‌ చేస్తున్నట్లు ఇరాన్‌ ఇంటర్నేషనల్‌ మీడియా పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి