Breaking News

మరోసారి పేలిన స్పేస్‌ఎక్స్‌ స్టార్‌షిప్‌..


Published on: 19 Jun 2025 14:52  IST

ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్‌ ఎలాన్‌ మస్క్‌ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా స్పేస్‌ఎక్స్‌ స్టార్‌షిప్‌ మరోసారి పేలింది.టెక్సాస్‌లోని ఎలాన్ మస్క్‌కు చెందిన పరీక్ష కేంద్రం వద్ద బుధవారం రొటీన్‌ స్టాటిక్‌ ఫైర్‌ టెస్ట్‌ నిర్వహించారు. ఈ క్రమంలో అది ఉన్నట్టుండి పేలిపోయింది. ఈ విషయాన్ని స్పేస్‌ఎక్స్‌ ఎక్స్‌ వేదికగా ధ్రువీకరించింది. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇది జరిగిందని పేర్కొంది. ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి