Breaking News

సోషల్‌మీడియాపై తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ నిఘా


Published on: 19 Jun 2025 16:45  IST

చైల్డ్‌ పోర్న్‌ వీడియోలు డౌన్‌లోడ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తోన్న పలువురిని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. సోషల్‌మీడియాపై తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పూర్తి నిఘా ఉంటుంది. నిందితులు సెక్సువల్‌ కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేస్తున్నారని గుర్తించాం.చిన్న పిల్లలకు సంబంధించి అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలు పోస్టు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం’’ అని డీజీ శిఖా గోయల్‌ హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి