Breaking News

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో కాస్కేడ్స్ నియోపోలిస్.. రూ. 3,169 కోట్ల పెట్టుబడి.. 63 అంతస్తుల నిర్మాణం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో కాస్కేడ్స్ నియోపోలిస్.. రూ. 3,169 కోట్ల పెట్టుబడి.. 63 అంతస్తుల నిర్మాణం


Published on: 20 Jun 2025 09:55  IST

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త మైలురాయిగా మారేలా ఓ పెద్ద లగ్జరీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా, లక్ష్మీ ఇన్‌ఫ్రా, అర్బన్ బ్లాక్స్ రియాల్టీ ప్రొమోటర్లు కలిసి రూపొందించిన జీహెచ్ఆర్ లక్ష్మీ అర్బన్ బ్లాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ "ది కాస్కేడ్స్ నియోపోలిస్" అనే పేరుతో కోకాపేటలో భారీ రిసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ. 3,169 కోట్ల మేర పెట్టుబడి ఖర్చు చేయనున్నారు.

ఈ ప్రాజెక్ట్‌లో 63 అంతస్తుల ఐదు టవర్లు ఉండబోతున్నాయి. ఒక్కో టవర్ ఎత్తు సుమారు 217 మీటర్లుగా ఉండేలా ప్లాన్ చేశారు. మొత్తం ప్రాజెక్ట్ 7.34 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతుంది. ఇందులో 3BHK మరియు 4BHK టైపుల్లో మొత్తం 1,189 అపార్ట్‌మెంట్లు ఉంటాయి. వీటి సైజు 2,560 చదరపు అడుగుల నుంచి 4,825 చదరపు అడుగుల వరకు విస్తరించి ఉంటుంది.

ఈ అపార్ట్‌మెంట్లకు అదనంగా, 54వ అంతస్తులో 10 ప్రత్యేకమైన ట్రిపుల్ లెవెల్ పెంట్‌హౌస్‌లు నిర్మించనున్నారు. లగ్జరీతో పాటు ప్రత్యేకతను కోరుకునే వారికి ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రాజెక్ట్‌లో స్కై గార్డెన్, ప్యాడిల్ టెన్నిస్ కోర్ట్, పికిల్ బాల్ కోర్ట్, యోగా డెక్, ఔట్‌డోర్ జిమ్ వంటి హై ఎండ్ అమీనిటీలు అందుబాటులో ఉంటాయి. అదనంగా, అత్యవసర అవసరాల కోసం రెండు హెలిప్యాడ్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఈ మొత్తం ప్రాజెక్టును 2030 మార్చి నాటికి పూర్తిచేసి కస్టమర్లకు అప్పగించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ నగరంలో సరికొత్త లగ్జరీ నివాసాలకు మారుపేరుగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు రియల్టీ నిపుణులు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement