Breaking News

ఇరాన్ నిర్ణయంతో షాక్.. చైనా సాయం కోరిన అమెరికా


Published on: 23 Jun 2025 10:43  IST

అణు స్థావరాలపై అమెరికా దాడులకు ప్రతీకారంగా హార్ముజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ముడి చమురు, సహజ వాయువు రవాణాకు కీలకంగా ఉన్న ఈ జలమార్గాన్ని మూసేస్తే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకు గురయిన అమెరికా చైనా సాయం కోరింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ సెక్రెటరీ మార్కో రూబియో ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు

Follow us on , &

ఇవీ చదవండి