Breaking News

బోనాల జాతరకు నగరం సిద్ధం..గోల్కొండలో ప్రారంభం


Published on: 26 Jun 2025 11:37  IST

బోనాల జాతరకు నగరం సిద్ధమైంది. నెల రోజుల పాటు సాగే ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. గోల్కొండ కోటపై ఉన్న జగదాంబికా అమ్మవారికి మొదటి పూజ నిర్వహించి పండుగను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. చివరి బోనంతో కోటలోనే ఉత్సవాలు ముగుస్తాయి. నెల రోజుల పాటు ప్రతీ గురు, ఆదివారాల్లో 9 పూజలు నిర్వహిస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి