Breaking News

ISSతో ఫాల్కన్‌-9 వ్యోమనౌక డాకింగ్‌ విజయవంతం..


Published on: 26 Jun 2025 16:38  IST

అంతరిక్షం లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అంతరిక్ష పరిశోధ కేంద్రం ISSతో ఫాల్కన్‌ వ్యోమ నౌక డాకింగ్‌ విజయవంతం అయ్యింది. బుధవారం(జూన్ 25) శుభాంశు శుక్లా తోపాటు మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని యాక్సియం-4 నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్‌లో చేపట్టిన ఫాల్కన్‌-9 విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. స్పేస్‌లో అడుగుపెట్టగానే జైహింద్‌.. జై భారత్‌ అన్న సందేశాన్ని శుభాంశు శుక్లా పంపించారు.

Follow us on , &

ఇవీ చదవండి