Breaking News

పుతిన్‌ టార్గెట్‌ ఉక్రెయిన్‌కు మించి.. ట్రంప్‌


Published on: 26 Jun 2025 17:25  IST

రష్యా- ఉక్రెయిన్‌ ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ను ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దండయాత్ర తర్వాత పుతిన్‌ ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. హేగ్‌లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్‌ ఇలా మాట్లాడారు. పుతిన్‌కు ఉక్రెయిన్‌ ను మించిన లక్ష్యాలు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు.. ఉండి ఉండొచ్చని ట్రంప్‌ సమాధానమిచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి