Breaking News

యుద్ధంలో మేమే గెలిచాం..అమెరికాకు చెంపపెట్టు: ఖమేనీ


Published on: 27 Jun 2025 14:29  IST

ఇజ్రాయెల్‌పై విజయం సాధించామని ఇరాన్‌ సుప్రీం నాయకుడు ఖమేనీ గురువారం తొలిసారి బహిరంగ ప్రకటించారు. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధంలో నేరుగా జోక్యం చేసుకున్న అమెరికాను ప్రస్తావిస్తూ ఇది అమెరికాకు పెద్ద చెంపపెట్టని ఖమేనీ వ్యాఖ్యానించారు. ఖమేనీ ప్రసంగాన్ని ఇరాన్‌ ప్రభుత్వ టెలివిజన్‌ ప్రసారం చేసింది.ఇరాన్‌లోని అణుస్థావరాలపై అమెరికా జరిపిన దాడులను ప్రస్తావిస్తూ పెద్ద నష్టమేమీ జరగలేదని, అమెరికా పెద్దగా ఏమీ సాధించలేకపోయిందని వ్యాఖ్యానించారు.

Follow us on , &

ఇవీ చదవండి