Breaking News

గుడివాడ కోర్టుకు కొడాలి నాని.. ఎందుకంటే..


Published on: 27 Jun 2025 17:10  IST

చాలాకాలం తర్వాత వైఎస్సార్సీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడలో మళ్లీ కనిపించారు. శుక్రవారం ఆయన స్థానిక కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న రావి వెంకటేశ్వరరావు‌కు చెందిన ఒక వస్త్ర దుకాణంపై జరిగిన దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. ఈ దరఖాస్తును పరిశీలించిన హైకోర్టు.. కింది స్థాయి కోర్టులో ష్యూరిటీ పత్రాలు సమర్పించాలని ఆదేశించడంతో, నాని గుడివాడ కోర్టుకు వచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి