Breaking News

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్..


Published on: 30 Jun 2025 15:14  IST

ఏపీలో బీజేపీ అధ్యక్షుడి ఎంపిక కొలిక్క వచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్‌.. గతంలో శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు. కాగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్ కాసేపట్లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఇక బీజేపీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం( 01-07-2025) అధికారికంగా నిర్వహించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి