Breaking News

‘సూపర్‌సిక్స్‌’ అమలుకు కట్టుబడి ఉన్నాం: సీఎం చంద్రబాబు


Published on: 01 Jul 2025 15:05  IST

ప్రతినెలా ఒకటోతేదీన గ్రామాలు కళకళలాడేందుకు పింఛన్లే ప్రధాన కారణమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో సీఎం పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. సూపర్‌సిక్స్‌ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. తాము పేదలను ఆదుకునేందుకు ‘పేదల సేవలో’ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. పింఛన్ల కోసమే నెలకు రూ.2,750 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ‘‘రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చాం. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని చంద్రబాబు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి