Breaking News

కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయాలు..


Published on: 01 Jul 2025 15:42  IST

దేశంలోని క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ కొత్త నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాలతో పాటు క్రీడాకారుల సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేయనుంది. అటు రీసెర్చ్ డెవలప్‌మెంట్ & ఇన్నోవేషన్ స్కీమ్‌‌కు కూడా క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. రూ. 1 లక్ష కోట్లతో కార్పస్ ఫండ్‌తో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే తమిళనాడులో పరమాకుడి-రామనాథపురం మధ్య 4 వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. రూ. 1,853 కోట్లతో 46.7 కిమీ మేర 4 వరుసలుగా రహదారి నిర్మించనుంది.

Follow us on , &

ఇవీ చదవండి