Breaking News

5 పరుగులకే 7 వికెట్లు..క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్


Published on: 03 Jul 2025 14:45  IST

కేవలం 5 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి ఒక్కసారిగా ఓటమి అంచుల్లో నిలిచింది బంగ్లాదేశ్. ఒకదశలో వికెట్ నష్టానికి 100 పరుగులు చేసిన బంగ్లా.. స్వల్ప వ్యవధిలో ఘోరంగా కుప్పకూలి 8 వికెట్ల నష్టానికి 105 పరుగులతో నిలిచింది. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో 2 నుంచి 8 వికెట్ల మధ్య వికెట్లను తక్కువ స్కోర్ కే కోల్పోయిన జట్టుగా బంగ్లా చెత్త రికార్డ్ మూటగట్టుకుంది.అంతకముందు ఈ రికార్డ్ యూఎస్ఏ పేరిట ఉంది. నేపాల్ జట్టుపై యూఎస్ఏ 8 పరుగుల వ్యవధిలో  7 వికెట్లను కోల్పోయింది.

Follow us on , &

ఇవీ చదవండి