Breaking News

సిగాచి దుర్ఘటన.. ఇంటర్వ్యూకు వచ్చిన యువతి అదృశ్యం


Published on: 03 Jul 2025 15:26  IST

పాశమైలారంలో సిగాచి పరిశ్రమ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రమాదం జరిగిన టైంలో ఇంటర్వ్యూ‌కు వచ్చిన ఓ యువతి గల్లంతైంది. సోమవారం (జూన్ 30) ఉదయాన్నే ఓ యువతి సిగాచి కంపెనీలో ఇంటర్వ్యూకి వచ్చింది. ఆమె హెచ్ఆర్ ఛాంబర్‌కు వెళ్లిన సమయంలో ప్రమాదం చోటు చేసుకుందని ఇతర కార్మికులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఆ యువతి జాడ తెలియని పరిస్థితి. ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై కూడా స్పష్టత లేదు.

Follow us on , &

ఇవీ చదవండి