Breaking News

60 క్వింటాళ్ల అక్రమ PDS రైస్..పట్టుకున్న పోలీసులు..


Published on: 03 Jul 2025 17:23  IST

రాష్ట్ర ప్రభుత్వ పథకంగా పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచి, అధిక ధరకు విక్రయించేందుకు ప్రయత్నించిన ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో బినవేని దేవయ్య అనే వ్యక్తిపై జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు గురువారం టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఎల్లారెడ్డిపేట పోలీసులతో కలిసి ఆకస్మిక దాడి నిర్వహించి, 60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి