Breaking News

లారీ క్యాబిన్‌లో మంటలు ముగ్గురు సజీవదహనం..


Published on: 04 Jul 2025 12:03  IST

ఖమ్మం – వరంగల్ మధ్య జాతీయ రహదారిపై మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ క్యాబిన్‌లో మంటలు చెలరేగి ముగ్గురు సంజీవ దహనమయ్యారు. మరొకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. రెండు లారీలు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా క్యాబిన్‌లో మంటలు చేలరేగి ఈ దారుణం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి