Breaking News

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన కేటీఆర్


Published on: 04 Jul 2025 17:25  IST

మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ (KCR) ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. సాధారణ వైద్య పరీక్షల కోసం నిన్న సాయంత్రం ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారని తెలిపారు. బ్లడ్‌ షుగర్‌, సోడియం స్థాయులు పర్యవేక్షించేందుకు కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు సూచించినట్టు చెప్పారు. ఎలాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు లేవని, కేసీఆర్‌ క్షేమం గురించి ఆరాతీస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి