Breaking News

భద్రాచలం ఆలయ ఈవోపై దాడి


Published on: 08 Jul 2025 18:29  IST

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారికి ఏపీలోని పురుషోత్తపట్నంలో ఉన్న భూముల్లో ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈవో రమాదేవిపై గ్రామస్థులు దాడి చేశారు. ఈవోతో పాటు ఆలయ సిబ్బందిపైనా ఆక్రమణదారులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో స్పృహ తప్పి పడిపోయిన ఈవోను ఆలయ సిబ్బంది భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమెతో పాటు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి వినీల్‌ అస్వస్థతకు గురికావడంతో అతడికి కూడా చికిత్స అందిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి