Breaking News

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ కేబినెట్


Published on: 09 Jul 2025 16:51  IST

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి కేబినెట్ తీపి కబురు చెప్పింది. ధాన్యం పాత బకాయిలు రూ.1000 కోట్లలో రూ. 672 కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నగదును 24 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నిధులు రైతుల ఖాతాల్లో వేసే బాధ్యతను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కి ప్రభుత్వం అప్పగించింది.

Follow us on , &

ఇవీ చదవండి