Breaking News

ఉక్రెయిన్, రష్యా యుద్ధం.. ట్రంప్ కీలక నిర్ణయం..


Published on: 14 Jul 2025 12:38  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌‌పై గత కొంతకాలంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పుతిన్ తనతో ఫోన్‌లో ఎంతో చక్కగా మాట్లాడతాడని, తర్వాత అందరిపై బాంబులు వేస్తాడని ట్రంప్ మండిపడుతున్నారు. పుతిన్ తన మాటలు లెక్కచేయకపోవటంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు పాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని పంపుతున్నారు. ఆదివారం ఇందుకు సంబంధించి ఓ కీలక ప్రకటన చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి