Breaking News

రైళ్లలో తిరుగుతున్న నకిలీ టీటీఈ పట్టివేత..


Published on: 15 Jul 2025 16:21  IST

మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైల్లో జనరల్ బోగీల్లో తనికీలు నిర్వహించాడు. ఇక, అదే రైళ్లో తనిఖీలు చేస్తున్న గుంటూరుకి చెందిన అసలు టీటీఈ జాన్ వెస్లీకి నకిలీ టీటీఈ తారసపడ్డాడు. టీటీఈగా గుర్తింపు కార్డు చూపాలని నకిలీ టీటీఈని జాన్ వెస్లీ ప్రశ్నించాడు. విధుల్లో ఉన్న జాన్ వెస్లీతో అతడు వాదనకు దిగాడు. రైలు నరసరావుపేటకి రాగానే దూకి పరారైయ్యేందుకు ప్రయత్నం చేశాడు.అయితే, నరసరావుపేటలో నకిలీ టీటీఈని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి