Breaking News

త్వరలో సినిమాల బాధ్యతల నుంచి రాజ్యసభ పదవిలోకి అడుగుపెట్టనున్న కమల్‌ హాసన్‌.

మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధినేతగా ఉన్న కమల్‌ను పార్లమెంటులోకి పంపేందుకు పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


Published on: 15 Apr 2025 18:04  IST

కమల్‌ హాసన్‌ :విలక్షణ నటుడిగా పేరుగాంచిన కమల్‌ హాసన్‌ త్వరలో రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధినేతగా ఉన్న కమల్‌ను పార్లమెంటులోకి పంపేందుకు పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

తమిళనాడులోని కోయంబత్తూర్‌లో అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు తంగవేల్‌ ఈ విషయం వెల్లడించారు. కమల్‌ను రాజ్యసభకు పంపాలని పార్టీ సమ్మతించిందని తెలిపారు.

2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న మక్కళ్‌ నీది మయ్యం పార్టీకి, ఇప్పుడు ఆ పొత్తులో భాగంగా ఓ రాజ్యసభ సీటు కేటాయించే అవకాశముందట. జులైలో డీఎంకేకు చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుండటంతో, అందులో ఒక స్థానాన్ని కమల్‌హాసన్‌కు కేటాయించే అవకాశం ఉంది.

ఇక సినిమాల విషయానికొస్తే, కమల్‌ హాసన్‌ ప్రస్తుతం తన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘థగ్ లైఫ్’ షూటింగ్ ఇప్పటికే ముగిసింది. ఈ భారీ అంచనాల చిత్రం జూన్‌ 5న విడుదలకానుంది.

ఈ సినిమా పూర్తిచేసిన తర్వాత, కమల్‌ మరో ప్రయోగాత్మక సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఆయన త్వరలో సినిమాల బాధ్యతల నుంచి రాజ్యసభ పదవిలోకి అడుగుపెట్టనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి