Breaking News

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..


Published on: 17 Jul 2025 15:43  IST

ఏపీలో బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని అతివేగంతో ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ రోడ్డు ప్రమాదంలో నాని అనే వ్యక్తి బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి