Breaking News

ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఆఫీసర్‌ పోస్టుల నోటిఫికేషన్‌


Published on: 21 Jul 2025 17:30  IST

కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ)లో అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 10, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 3,717 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొందినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Follow us on , &

ఇవీ చదవండి