Breaking News

తెలంగాణలో ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు.


Published on: 21 Jul 2025 18:40  IST

తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య-వాయువ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, యానం మీదుగా సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవరణం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి