Breaking News

హైదరాబాద్‌లో మరో 2 జీసీసీలు!


Published on: 23 Jul 2025 11:44  IST

ఐటీ, ఐటీఈఎస్‌ రంగానికి చెందిన జీసీసీ (గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌) లను ఆకర్షించడంలో హైదరాబాద్‌ ఎంతో ముందుంటోంది. అమెరికాకు చెందిన మరో 2 దిగ్గజ సంస్థలు ఇక్కడ తమ జీసీసీలు ఏర్పాటు చేయబోతున్నాయని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలకు అవసరమైన ఐటీ సేవలు అందించేందుకే ఈ సంస్థలు తమ జీసీసీలను ఇక్కడ నెలకొల్పే యత్నాల్లో ఉన్నాయి. ఇందులో ఒకటి నేషన్‌వైడ్‌ మ్యూచువల్‌ ఇన్సూరెన్స్‌ అనే సంస్థ కాగా, మరొకటి రిటెయిల్‌ సంస్థ కాస్ట్‌కో.

Follow us on , &

ఇవీ చదవండి