Breaking News

స్థిరాస్తి రంగం పరుగులు


Published on: 24 Jul 2025 11:47  IST

రాష్ట్రంలో స్థిరాస్తి రంగంలో నెలకొన్న స్తబ్ధత తొలగింది. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రణాళికలతో ఆస్తుల క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో స్థిరాస్తి రంగంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.2,663.70 కోట్లు ఖజానాకు జమయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి రూ.1,821.17 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఈ ఏడాది 46.26% వృద్ధి నమోదైనట్లు.ఈ పరిణామం రాష్ట్రంలో స్థిరాస్తి రంగం పుంజుకుందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి