Breaking News

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు


Published on: 25 Jul 2025 17:30  IST

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అందులో భాగంగా ఈ వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకిందని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ రోజు.. అంటే శుక్రవారం ఉత్తర కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.

Follow us on , &

ఇవీ చదవండి