Breaking News

జల ప్రళయం.. కొట్టుకుపోయిన గ్రామం


Published on: 05 Aug 2025 17:06  IST

ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ రాష్ట్రం చిగురుటాకులా వణుకుతోంది. పలు ప్రాంతాల్లో భారీగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. మంగళవారం ఉత్తర కాశీ సమీపంలోని దరాలి గ్రామంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 50 మంది వరకు గల్లంతయినట్లు తెలుస్తుంది. దీనిపై సమాచారం అందుకోగానే జిల్లా అధికారులు, ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బందితోపాటు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి