Breaking News

తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు


Published on: 01 Sep 2025 18:33  IST

తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఏర్పాటుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారుడు కె. కేశవరావును నియమించింది. ఆయనతో సహా ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా మెంబర్ కన్వీనర్‌‌గా వ్యవహరించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి