Breaking News

నేపాల్‌లో టెన్షన్..! సోషల్‌ మీడియాపై నిషేధం..


Published on: 08 Sep 2025 14:41  IST

నేపాల్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. నేపాల్‌ పార్లమెంట్‌లోకి ఆందోళనకారులు దూసుకెళ్లారు. పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం ఖాట్మండులో కర్ఫ్యూ విధించింది. సోషల్‌ మీడియాపై కూడా బ్యాన్‌ విధించారు. Gen-z పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని అక్కడి యువత చేపట్టింది. ఆందోళనకారులపై భాష్పవాయువును ప్రయోగించారు. ప్రధాని ఓలి తీరును ఆందోళనకారులు తీవ్రంగా తప్పుపట్టారు. నేపాల్‌ ప్రభుత్వం మొత్తం 26 యాప్స్‌పై బ్యాన్‌ విధించింది.

Follow us on , &

ఇవీ చదవండి