Breaking News

ఐదేళ్లలో రూ.25 లక్షల కోట్లతో రెండున్నర కోట్ల ఉద్యోగాల కల్పన దిశగా పరుగెడుతున్న బయో డిజైనింగ్‌ వివిధ శాఖల్లోకి ప్రవేశించింది.

ఐదేళ్లలో రూ.25 లక్షల కోట్లతో రెండున్నర కోట్ల ఉద్యోగాల కల్పన దిశగా పరుగెడుతున్న బయో డిజైనింగ్‌ వివిధ శాఖల్లోకి ప్రవేశించింది.


Published on: 09 Sep 2025 16:03  IST

ఇటీవల కాలంలో టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంటర్‌టెయిన్‌మెంట్ రంగాలు భారీగా ఎదుగుతున్న సంగతి మనం చూసాం. ఇప్పుడు వాటిలో ముందు వరుసలో నిలిచే కొత్త రంగంగా బయో డిజైనింగ్ ఎదుగుతోంది. ప్రస్తుతం సాధారణ స్థాయిలో ఉన్న ఈ రంగం త్వరలోనే విప్లవాత్మకంగా అభివృద్ధి చెందబోతుంది.

బయో డిజైనింగ్ అంటే జీవశాస్త్రం, సాంకేతిక విజ్ఞానం కలిపి జీవ ఉపకరణాలు, ఉత్పత్తులు రూపకల్పన చేయడం. ఇది కేవలం వైద్య రంగానికి పరిమితమని కాదు, బయో ఫార్మా, బయో అగ్రికల్చర్, బయో ఇండస్ట్రియల్, బయో ఐటీ వంటి విభాగాల్లో విస్తరించి ఉంది. రాబోయే ఐదు సంవత్సరాల్లో రూ.25 లక్షల కోట్ల ఆదాయాన్ని, కోటి మందికి పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించే దిశగా పయనిస్తోంది.

ప్రధానంగా నేషనల్ బయోటెక్నాలజీ డెవలప్‌మెంట్ స్ట్రాటజీ, నేషనల్ బయో ఫార్మా మిషన్ వంటి కేంద్రప్రభుత్వ ప్రోత్సాహకాలు ఈ రంగ అభివృద్ధికి దోహదపడుతున్నాయి. యువతకు అనేక స్టార్టప్స్‌, బయో హబ్స్ అవకాశాలను అందిస్తున్నాయి. హైదరాబాద్, కర్ణాటక వంటి ప్రాంతాలు బయోటెక్ రంగంలో ముందున్నాయి.

ఇప్పటి వరకు పరిమితంగా ఉన్న వైద్య ఉపకరణాలు ఇప్పుడు ఆధునిక చికిత్సల కోసం అపారంగా అవసరమవుతున్నాయి. మాన్యువల్‌ సర్జరీల నుంచి లాప్రోస్కోపిక్‌, మినిమల్‌, రోబోటిక్ సర్జరీల దశకు పరిణమించాయి. వీటికి సంబంధించిన నైపుణ్యాలు కూడా తలెత్తుతున్నాయి. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, బయోకాన్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, భారత్ బయోటెక్ వంటి సంస్థలు ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి.

ఇటీవల ఈ రంగం ప్రత్యేక పరిశ్రమగా స్వతంత్రంగా ఏర్పడుతోంది. ఉదాహరణకి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ గతంలో పరిమిత స్థాయిలో ఉండగా, ఇప్పుడు లక్షల కోట్ల రూపాయల వ్యాపారంతో ఉన్న ప్రత్యేక రంగంగా మారిపోయింది. అదే విధంగా బయోడిజైనింగ్ కూడా సమీప భవిష్యత్తులో స్వతంత్ర పరిశ్రమగా ఎదగబోతోంది.

ఈ రంగంలో మానవ వనరులు ఎంతో కీలకం. సరైన నైపుణ్యాలు పొందిన యువతే భవిష్యత్తు పరిశ్రమను మలచగలదు. అందువల్ల విద్యార్థులు, ఉద్యోగార్థులు, తల్లిదండ్రులు ఈ రంగాన్ని గుర్తించి ముందుగా నేర్చుకోవడం అవసరం.

ఈ రంగం తలెత్తడం ద్వారా మన దేశం సాంకేతిక, ఆరోగ్య, పారిశ్రామిక రంగాల్లోనే కాకుండా ప్రపంచ స్థాయిలో ముందుండే అవకాశం కలిగి ఉంది. ఇప్పుడు ముందస్తుగా ఈ మార్గంలో అడుగులు వేస్తే, పరిశ్రమ అభివృద్ధితో పాటు మన వ్యక్తిగత ప్రగతికూ దోహదపడుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి