Breaking News

ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందే: కేటీఆర్‌


Published on: 09 Sep 2025 15:14  IST

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) డిమాండ్‌ చేశారు. జడ్చర్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో 10 మంది ఎమ్మెల్యేలు చేరినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ చెప్పారని, వారిపై చర్యలు తీసుకునేందుకు స్పీకర్‌ ఎందుకు మొహమాట పడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దురవస్థలో ఉన్నారని దుయ్యబట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి