Breaking News

కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..


Published on: 10 Sep 2025 16:11  IST

పశ్చిమ మధ్య బంగాళఖాతం, ఉత్తరకోస్తా, దక్షిణకోస్తాపైన ఉపరితల ఆవర్తనం కోనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం వలన రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తాజిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడేటువంటి ఆవకాశం ఉందని హెచ్చరించారు. దక్షిణ కోస్తాలో గుంటూరు, బాపట్ల, కృష్ట, పల్నాడులో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అటు రాయలసీమలో కూడ అక్కడికక్కడ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి