Breaking News

అలీనోద్యమానికి 70 ఏళ్లు – హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్‌కు సన్నాహాలు

ఏప్రిల్ 25, 26 తేదీల్లో హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ సదస్సుకు సుమారు 100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం


Published on: 25 Apr 2025 17:25  IST

అలీనోద్యమానికి 70 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం "భారత్ సమ్మిట్‌" పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఏప్రిల్ 25, 26 తేదీల్లో హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ సదస్సుకు సుమారు 100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర ప్రముఖులు హాజరవుతారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘భారత్‌ శాంతి, సమానత్వం విలువలను ప్రపంచానికి తెలియజేయడమే ఈ సదస్సు ఉద్దేశం’’ అన్నారు. 

అలీనోద్యమం అంటే ఏంటి?

అలీనోద్యమం అనేది రెండో ప్రపంచ యుద్ధం, ఆర్థిక మాంద్యం పరిస్థితులలో సోవియట్ యూనియన్, అమెరికా కూటములు ఏర్పడ్డాయి. 'కోల్డ్ వార్' తీవ్ర స్థాయిలో ఉన్న దశలో అలీనోద్యమం తెరపైకి వచ్చింది.ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికా, సోవియట్ యూనియన్..కూటముల వైపు తలొగ్గకుండా మిగిలిన దేశాలన్నీ స్వతంత్రంగా ఉండేందుకు అలీనోద్యమం మొదలైందని దిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆఫ్రికన్ స్టడీస్ ప్రొఫెసర్ అజయ్ కుమార్ దూబే చెప్పారు.

1955లో బాండుంగ్‌లో జరిగిన సదస్సు ఈ ఉద్యమానికి ప్రధాన మైలురాయిగా నిలిచింది. అప్పట్లో ఆసియా, ఆఫ్రికా దేశాలు తమ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడంలో భాగంగా ఈ ఉద్యమంలో చేరాయి.

తెలంగాణ వేదికగా సదస్సు – రాజకీయ చర్చ

ఈ సమ్మిట్‌ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం పట్ల మిశ్రమ స్పందనలు ఉన్నాయి. ఇది విదేశాంగానికి సంబంధించిన అంశమన్నా, రాష్ట్ర ప్రభుత్వం దానిని నిర్వహించడం న్యాయసమ్మతమేనని రాజకీయం పరిశీలకుడు కె. నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ సమ్మిట్‌ను రాష్ట్ర చరిత్రలో ఓ మైలురాయిగా అభివర్ణించారు. భారత్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రాక కూడా అవకాశం ఉందని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి