Breaking News

నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత


Published on: 16 Sep 2025 12:20  IST

రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ‘టీఏఎన్‌హెచ్‌ఏ’ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ వద్దిరాజు రాకేశ్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ కింద అనుసంధానమైన 323 ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి పెద్దమొత్తంలో బకాయిలు రావాల్సి ఉందని, ఈ విషయమై ఆరోగ్యశాఖ మంత్రి, ఆరోగ్యశ్రీ సీఈవోలను కలిశామని..అయినా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు

Follow us on , &

ఇవీ చదవండి