Breaking News

ఛాన్స్ లేదు పాకిస్తాన్ శరణమా...? రణమా...?

భారత నౌకాదళం అరేబియా సముద్రంలో యుద్ధనౌకల సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. యుద్ధానికి ఎల్లప్పుడూ సిద్ధం అంటూ నౌకాదళం , భారత సైన్యం స్పష్టం చేసింది.


Published on: 28 Apr 2025 10:19  IST

పహల్గాం ఉగ్రదాడిపై మోదీ స్పందన
పహల్గాం ఘటనతో ప్రతి భారతీయుడి హృదయం కలవరపడిందని, బాధిత కుటుంబాలకు న్యాయం జరగడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. "మన్‌కీ బాత్" కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, దాడి చేసిన ఉగ్రవాదులు, వారిని మద్దతిచ్చినవారికి కఠిన శిక్ష తప్పదన్నారు. కశ్మీర్‌లో శాంతి పునరుద్ధరమవుతున్న దశలో ఈ దాడి, ఉగ్రవాదుల నాటకమేనని విమర్శించారు. దేశ ప్రజల ఐక్యతే ఉగ్రవాదంపై పోరాటానికి బలమని పేర్కొన్నారు.

నౌకాదళం సన్నద్ధత ప్రదర్శన
పాకిస్తాన్ అణు బెదిరింపులు చేస్తున్న వేళ, భారత నౌకాదళం అరేబియా సముద్రంలో యుద్ధనౌకల సామర్థ్యాన్ని పరీక్షించింది. నౌకల నుంచి విధ్వంసక క్షిపణులు విజయవంతంగా ప్రయోగించాయి. "దేశ రక్షణకు ఎప్పుడూ సిద్ధం" అంటూ నౌకాదళం స్పష్టం చేసింది. సైన్యం కూడా "ఎల్లప్పుడూ అప్రమత్తం" అంటూ సందేశం ఇచ్చింది.

కశ్మీర్‌లో ఉగ్రవాదంపై కఠిన చర్యలు
ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసేందుకు కశ్మీర్‌లో సోదాలు కొనసాగుతున్నాయి. గత ఆరు రోజుల్లో భద్రతా దళాలు 10 మంది ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేశారు. నియంత్రణ రేఖ వద్ద పాక్ కవ్వింపు కాల్పులకు భారత సైన్యం గట్టి ప్రతిస్పందన ఇస్తోంది.

సరిహద్దు రైతులకు సూచనలు
భారత్-పాక్ ఉద్రిక్తతలు పెరగుతున్న నేపథ్యంలో, సరిహద్దు ప్రాంత రైతులకు 48 గంటల్లో పంట కోత పూర్తి చేయాలని బీఎస్‌ఎఫ్ ఆదేశించింది. పంజాబ్ సెక్టార్‌లోని గోధుమ పొలాల్లో ఇప్పటికే 80-90 శాతం కోత పూర్తయిందని రైతులు తెలిపారు. భవిష్యత్తులో సరిహద్దు గేట్లు మూసే అవకాశం ఉందని హెచ్చరికలు వచ్చాయి.

Follow us on , &

ఇవీ చదవండి