Breaking News

భూమనకు పోలీసులు నోటీసులు జారీ..


Published on: 17 Sep 2025 14:35  IST

తిరుపతిలోని అలిపిరి సమీపంలో ఒక విగ్రహం నిర్లక్ష్యానికి గురైందంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనపై కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డికి బుధవారం అలిపిరి పోలీసులు 41 ఏ నోటీసులు జారీ చేశారు. గురువారం తిరుపతి డీఎస్పీ కార్యాలయానికి హాజరు కావాలంటూ జారీ చేసిన నోటీసుల్లో భూమనకు స్పష్టం చేశారు.వీలు చూసుకుని రావాలంటూ భూమనకు ఎస్ఐ అజిత సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి